News

National

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొననున్న మమతా బెనర్జీ..

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షల్లో సంస్కరణలు కోరుతూ యువత చేపట్టిన ఉద్యమానికి ఆమె తన మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా, జూలై 27న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని శుక్రవారం వెల్లడించారు.   ఇదే సమయంలో, లోక్‌సభలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా సీనియర్…

AP

మంగళగిరి కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కల్యాణ్..

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీశాఖ కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన ‘జయంత్’, ‘అభిమన్యు’ అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.   కుంకీ ఏనుగులకు పూలమాలలు వేసి, స్వయంగా చెరుకు…

AP

ఉండి వైసీపీలో కలకలం.. వైసీపీకి గుడ్ బై చెప్పనున్న పీవీఎల్ నరసింహరాజు..?

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసీపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ పీవీఎల్ నరసింహరాజు వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఆయన ఈరోజే తన అధికారిక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.   ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. పీవీఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది.…

TELANGANA

పార్టీ మార్పు పై మల్లారెడ్డి క్లారిటీ..!

రాజకీయ వర్గాల్లో గత కొద్ది రోజులుగా తన పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారానికి బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి చెక్ పెట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న ఆయన, తాను బీఆర్‌ఎస్‌ను వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారమేనని స్పష్టం చేశారు.   తాను పార్టీ మారుతున్నాననే రూమర్లను నిజమని నమ్మి ఒక అభిమాని తన సొంత రక్తంతో లేఖ రాయడం…

National

ఎప్పుడైనా రండి.. చర్చలకు మేం రెడీ.. సీజేపీకి కేంద్ర మంత్రి ఆహ్వానం..!

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు నిరసనకారులతో మాట్లాడేందుకు ముందడుగు వేసింది.   నిరసనకారులకు కేంద్రం ఆఫర్   ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు, కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నాయకులకు చర్చల పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఆందోళనకారులకు అనుకూలమైన…

TELANGANA

సింగరేణికోసం తెలంగాణ సర్కార్ బిగ్ ప్లాన్..!

పోటీ ప్రపంచంలో సింగరేణి క్యాలరీస్ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి తెలంగాణకు ఆత్మలాంటిదని, కార్మికులు, ప్రజలతో 130 ఏళ్ల చరిత్రకలిగిన సింగరేణితో భావోద్వేగ అనుబంధం ఉందని బట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడమే కాకుండా, రాబోయే తరాలకు లాభదాయకంగా అందించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. సత్తుపల్లిలోని…

TELANGANA

బీఫ్ ఆర్డర్లు, బిర్యానీలు..! ఢిల్లీ నిరసనలు రాంచందర్ రావు షాకింగ్ కామెంట్స్..!

నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో అనేక పేపర్ లీకేజీలు జరిగాయని, అప్పుడు ఎవరైనా రాజీనామా చేశారా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. పేపర్ లీకేజీ అంశంతో కావాలనే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రాహుల్ గాంధీ చూస్తున్నారన్నారు. జంతర్ మంతర్ నిరసనకు హైదరాబాద్…

AP

ఏపీలో మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్ ప్రారంభంచిన సీఎం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలతో, నకిలీ రిజిస్ట్రేషన్లతో వేధిస్తున్న భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక ముందడుగు వేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ఆయన అధికారికంగా ప్రారంభించారు. రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే కాకుండా, రైతుల భూములకు శాశ్వత రక్షణ కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.   భూ రికార్డులకు తిరుగులేని భద్రత   ఈ…

AP

కూటమి సర్కార్‌పై వైసీపీ మాజీ మంత్రుల సంచలన సమరశంఖం..!

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి వేదికగా మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, విడదల రజిని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వారిని రాజకీయంగా, ఆర్థికంగా అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు.   చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలను బానిసలుగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. రుణాల కోసం…

AP

తిరుమలలో 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం చోరీ..

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద భక్తుల నిత్య పూజలందుకునే ప్రాచీన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. నిత్యం వందలాది మంది భక్తులు ఆగి స్వామివారిని దర్శించుకునే ఈ ప్రాంతంలో విగ్రహం కనిపించకపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.   ఈ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా… కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అత్యంత చాకచక్యంగా…