ప్రపంచ వేదికపై భారత్‌కు సముచిత గౌరవం లభిస్తోంది: పుతిన్ ప్రశంస..
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ సాధించిన విజయాలను కొనియాడుతూ, ప్రపంచ వేదికపై దేశానికి ‘సముచిత గౌరవం’ లభిస్తోందని ప్రశంసించారు. ఫ్రాన్స్, అమెరికాతో దేశాల అధినేతలు కూడా భారత్‌కు అభినందనలు తెలియజేశారు. “ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలతో పాటు ఇతర అనేక రంగాల్లో భారతదేశం సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. అంతర్జాతీయ వేదికపై మీ దేశానికి గొప్ప గౌరవం లభిస్తోంది.…

