కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు… ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలన్న విజ్ఞప్తి తిరస్కరణ..
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా, హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే విచారణ జరపనున్నట్లు సిట్ స్పష్టం చేసింది. ఇటీవల గురువారం సిట్ తొలిసారి నోటీసులు జారీ చేయగా, మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఖరారు…

