అవార్డుల్లో భారీ లాబీయింగ్ ఉంటుంది.. ఆస్కార్ కూడా మినహాయింపు కాదు: పరేశ్ రావల్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ సినీ అవార్డుల ఎంపిక ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు అన్నింట్లోనూ లాబీయింగ్ జరుగుతుందని, దీనికి ఏ పురస్కారాలూ మినహాయింపు కావని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జాతీయ అవార్డుల విషయంలో లాబీయింగ్ ఎక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అవార్డుల కోసం చిత్రబృందాలు తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటాయని, కొన్ని పార్టీల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తాయని పరేశ్ రావల్ తెలిపారు. “కొంతమంది…

