కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం: పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి రైతులను వేధిస్తున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన ‘ఆపరేషన్ కుంకీ’ విజయవంతమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం మొగిలి ప్రాంతంలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును.. శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు విజయవంతంగా అడవిలోకి తరిమికొట్టాయని వెల్లడించారు. ఈ ఆపరేషన్ సఫలం కావడంతో సరిహద్దు ప్రాంతాల రైతులకు భరోసా లభించినట్లయిందని పేర్కొన్నారు.…

