News

AP

ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్..! ఈ రూల్స్ పాటించాల్సిందే..!

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఓ చక్కని స్వేచ్ఛ దక్కబోతోంది. పొద్దున్న బయటకి వస్తే.. బస్సు ఎక్కాలనిపిస్తే.. టికెట్ విషయంలో ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఏపీలో అమలు కానున్నది.. మహిళల ఉచిత బస్సు పథకం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ మహిళలకు నిజమైన ప్రయాణ స్వాతంత్ర్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.   ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. టికెట్ లేదు! ఈ పథకం ద్వారా రాష్ట్రంలో…

TELANGANA

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా ఉపాసన..!

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఛైర్మన్ గా సంజీవ్ గోయెంకాను, కో-ఛైర్మన్ గా ఉపసనను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.   ఎక్స్ వేదికగా ఉపాసన స్పందిస్తూ… సీఎం రేవంత్ కు థ్యాంక్స్ చెప్పారు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే…

TELANGANA

కేసీఆర్, హరీశ్ వద్ద ఎన్ని కోట్లు ఉంటాయో ఊహించవచ్చు: కోమటిరెడ్డి..

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల వద్దే కోట్లు దొరుకుతున్నాయంటే… ఆ సమయంలో అధికారంలో ఉన్న కేసీఆర్, హరీశ్ రావు వద్ద ఎన్ని కోట్లు ఉంటాయో ఊహించవచ్చని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని… కేబినెట్ సమావేశం తర్వాత అన్ని విషయాలను వెల్లడిస్తారని చెప్పారు.   సీఎం రేవంత్ గురించి మాట్లాడుతూ… రేవంత్ జూనియర్ అయినప్పటికీ…

TELANGANA

కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలు.. స్పందించిన కొండా సురేఖ.

తనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి కాగ్నిజెన్స్ తీసుకుని ముందుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఈ దేశ న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. కేసులు, కొట్లాటలు తనకు కొత్తేమీ కాదని అన్నారు.   తన జీవితమే ఒక పోరాటమని, ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం…

AP

త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ.. చంద్రబాబు కీలక ప్రకటన..

కష్టపడి పనిచేసిన వారికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కార్యకర్తలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడతామని వివరించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో-ఆర్డినేటర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.   ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో తాము చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పుకోలేక నష్టపోయామని అన్నారు. ప్రస్తుతం కూటమి…

National

జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా.. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల..

నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9న నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయగా, దానిని రాష్ట్రపతి ఆమోదించడంతో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.   ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల, 21న నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ, 22న స్క్రూటినీ ఉంటుంది. ఆగస్టు 25వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 9న…

TELANGANA

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బీటెక్ రవి భార్య పోటీ..

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతోందని, అక్కడ టీడీపీ నేత బీటెక్ రవి భార్య పోటీ చేస్తారని వెల్లడించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆమె గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.   ఇక, రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. చంద్రబాబు ఓపిక పట్టడం వల్లే జగన్, ఇతర వైసీపీ నేతలు స్వేచ్ఛగా తిరగ్గలుగుతున్నారని తెలిపారు. పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు కక్ష ఉంటే ఈపాటికే…

TELANGANA

బనకచర్ల ప్రాజెక్టు పై హరీష్ రావు సంచలన వాఖ్యలు..! ఏమన్నారంటే..?

కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామనే ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని చెబుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును కట్టి తీరుతామని లోకేశ్ మాట్లాడుతుంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ‘మా తెలంగాణ హక్కుల సంగతి ఏమిటి’ అని ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకులు ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు.   ఏదో లోపాయికారి…

TELANGANA

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరిన కాళేశ్వరం కమిషన్ నివేదిక..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అందింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన నివేదికను గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. ఈ రోజు ఆ నివేదిక ముఖ్యమంత్రికి చేరింది.   కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అనేక వైఫల్యాలు ఉన్నాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత…

AP

గిరిజనుల కోసం రగ్గులు పంపించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకవైపు అగ్ర నటుడిగా మూవీల్లో నటిస్తూనే, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తున్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో గిరిజనులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.   అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి, డుంబ్రిగూడ గ్రామాలను పవన్ కల్యాణ్ సందర్శించిన సమయంలో అక్కడి వారి బాధలు చూసి పాదరక్షలు పంపించారు. తన తోటలోని ఆర్గానిక్ పండ్లు…