స్పేస్ పాలసీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి వర్తించే కొత్త అంతరిక్ష విధానాన్ని (స్పేస్ పాలసీ) ప్రకటించింది. ఈ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర స్పేస్ సిటీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ స్పేస్ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం పెట్టుకుంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ఈ ప్రాజెక్టులలో భాగస్వామ్యులుగా చేసుకోవాలని సూచించింది. స్పేస్ సిటీ…

