News

AP

తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక ట్విస్ట్ లు..!

ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్రదారులుగా గుర్తించిన అధికార పార్టీ నాయకులను పార్టీ సస్పెండ్‌ చేసింది. పలువురు వ్యక్తులు అరెస్ట్‌ అయ్యారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీకి విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు కూటమి నేతలు.   ఏపీ కల్తీ మద్యం కేసులో రాజకీయ దుమారం.. ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేసిన సీఐ   మొత్తం 12 మంది…

National

దగ్గు మందులో విషపూరిత రసాయనాలు..! రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో 11 మంది చిన్నారుల మరణానికి కారణమైన కోల్డ్ రీఫ్ దగ్గుమందులో విషపూరితమైన డై ఇథలీన్ గ్లైకాల్(DEG), ఇథలీన్ గ్లైకాల్(EG) ఉన్నట్టు నిర్థారణ అయింది. దీనివల్లే 11మంది చిన్నారులు మరణించాలని తేలింది. దీంతో ఆ కంపెనీపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ కంపెనీ తయారు చేసే ఇతర మందుల అమ్మకాలను కూడా నిషేధించింది.   డై ఇథలీన్ గ్లైకాల్.. వాస్తవానికి మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఈ దగ్గుమందు తమిళనాడులో తయారైంది. జైపూర్…

TELANGANA

ఆర్టీసీ ఛార్జీల పంపుపై కేటీఆర్ విమర్శలు..!

జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని సిటీ బస్సు ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచింది. ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. సిటీ బస్సు ఛార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.   సామాన్యులపై ఛార్జీల భారం ‘పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో, ప్రతి…

TELANGANA

జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? లిస్ట్‌లో ఆ నలుగురు..!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం తన కసరత్తును పూర్తి చేసి, నలుగురు ఆశావహుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పార్టీ అధిష్ఠానానికి పంపనుండటంతో, ఇప్పుడు అందరి దృష్టీ ఢిల్లీ పెద్దల నిర్ణయంపైనే నిలిచింది.   పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిన తుది జాబితాలో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి,…

AP

చైల్డ్ కేర్ సెంటర్ లో శిశువు మరణంపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు తీవ్రమైన ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని ప్రభుత్వ శిశుగృహంలో ఏడాదిన్నర బాలుడు మృతి చెందడం, పార్వతీపురం మన్యం జిల్లాలోని గురుకుల పాఠశాలలో 85 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడంపై ఆయన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి. సంధ్యారాణితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.   అనంతపురం…

AP

కిలో టమాటా ఒక్క రూపాయి… కర్నూలు జిల్లాలో రైతుల ఆగ్రహం..

కంటికి రెప్పలా కాపాడుకున్న పంటకు కనీస ధర కూడా దక్కకపోవడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో ధర కేవలం రూపాయికి పడిపోవడంతో ఆగ్రహించిన రైతులు, తాము పండించిన టమాటాలను రోడ్డుపై పారబోసి తీవ్ర నిరసన చేపట్టారు. టమాటాలతో నిండిన బుట్టలను రహదారిపై కుమ్మరించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.   ఈ నిరసన కారణంగా పత్తికొండలోని గుత్తి-మంత్రాలయం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రైతులు…

AP

ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై రంగంలోకి డిప్యూటీ సీఎం..!

కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ తో ఎమ్మెల్సీ హరిప్రసాద్, పిఠాపురం ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నేతలు భేటీ అయ్యి పిఠాపురం అభివృద్ధి పనులపై చర్చించారు. మత్స్యకారుల సమస్యలు, కంపెనీల కాలుష్యంపై కలెక్టర్ తో నేతలు చర్చించారు.   మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై ఈ సమావేశం చర్చించారు. వచ్చే నెల 10లోగా…

Uncategorized

విద్యుత్ వాహనాలకు కేంద్రం కొత్త రూల్..! ఏంటంటే..,?

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వల్ల పొంచి ఉన్న నిశ్శబ్ద ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈవీల నుంచి కూడా శబ్దం వచ్చేలా ‘అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్’ (AVAS)ను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు భద్రతను పెంచే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురానుంది.   కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, 2027 అక్టోబర్…

TELANGANA

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తి లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి..

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తి లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగునీటి వినియోగదారుల సంఘాల అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. సాగునీటి సంఘాలతో చెరువులు, కాలువలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.   మొదట చెరువులతో ప్రారంభించి పెద్ద ప్రాజెక్టుల వరకు విస్తరిస్తామని ఆయన తెలిపారు. ప్రతి…

TELANGANA

జీహెచ్ఎంసీ ఉద్యోగులకు దసరా కానుక.. రూ.1.25 కోట్ల వరకు ఉచిత ప్రమాద బీమా..

దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది. పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ వర్తించేలా, ఎలాంటి ప్రీమియం భారం లేకుండా రూ.30 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.   ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)తో జీహెచ్ఎంసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల వినాయక నిమజ్జనం విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు…