News

National

స్వదేశీని మంత్రాన్ని స్వీకరించండి, దేశాన్ని బలోపేతం చేయండి: ప్రధాని మోదీ..

దేశ ప్రజలు ‘స్వదేశీ’ని స్వీకరించి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా, యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు.   “ప్రతి ఒక్కరూ గర్వంగా ‘స్వదేశీ’ అని చెప్పాలి. ఇది ప్రతి పౌరుడికి, మార్కెట్‌కు ఒక మంత్రంలా మారాలి. ప్రజలు…

TELANGANA

రేపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అయింది. నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.   రేపు ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్‌లు స్వీకరించనున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులకు…

TELANGANA

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్..

చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ఈ ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరిప్ లను విక్రియించకూడదని.. తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పిల్లల భద్రతను ముఖ్యంగా పరిగణించి తీసుకోవడం జరిగింది.   ఉపశమనానికి వేసిన దగ్గు మందు చిన్నారుల ప్రాణం తీసింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గుమందు మరణాలతో కేంద్రం అలర్ట్…

AP

పాడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! పశుగ్రాసం సాగుకు 100% రాయితీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాడి రైతులకు అవసరమయ్యే పశుగ్రాసం పెంచే దిశగా చర్యలు చేపట్టింది. రైతుల కోసం పశుగ్రాసం పెంపకం పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా 100 శాతం రాయితీతో పశుగ్రాసం సాగుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం పెంచేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పశుగ్రాసం సాగుకు రైతుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది.

AP

రోడ్ల మరమ్మత్తులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులకు రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 274 రహదారుల మరమ్మత్తుల కోసం తాజాగా ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర రహదారుల్లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రోడ్లలో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం.   అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వ…

AP

పశుసంవర్థక రంగంలో ఓ అరుదైన ఘట్టం..! కృష్ణా జిల్లాలో పుట్టిన తొలి టెస్ట్ ట్యూబ్ దూడ..

పశుసంవర్థక రంగంలో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) టెక్నాలజీ ద్వారా ఓ కోడెదూడ జన్మించింది. మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పశువైద్య అధికారులు, రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దేశీయ గో జాతులను అభివృద్ధి చేసి, పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.   ప్రయోగం జరిగిందిలా.. పశుగణాభివృద్ధి విభాగం అధికారులు గుంటూరు లాంఫాంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.…

National

పాకిస్థాన్ బండారం బయటపెట్టిన భారత్.. ఐరాసలో దిమ్మతిరిగే కౌంటర్..

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూసిన పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్థాన్ బూటకపు ప్రచారాన్ని తిప్పికొడుతూ, 1971లో బంగ్లాదేశ్‌లో పాక్ సైన్యం జరిపిన ‘సామూహిక అత్యాచార మారణహోమం’ గురించి గుర్తుచేసి దాని నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది.   భద్రతా మండలిలో సోమవారం ‘మహిళలు, శాంతి, భద్రత’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ అనూహ్యంగా…

TELANGANA

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై ఇప్పుడు లీగల్ ఫైట్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ జీవోపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. దానిని విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది ఉన్నత న్యాయస్థానం.   హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్న.. హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషన్‌ను ప్రశ్నించింది కోర్టు. హైకోర్టులో స్టే…

TELANGANA

కవిత సమక్షంలో బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు..

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మరో నేత.. తెలంగాణ జాగృతిలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నంగవత్ రాజేశ్ నాయక్, సోమవారం తెలంగాణ జాగృతిలో చేరికయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు.   కవిత ఆహ్వానం తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన రాజేశ్ నాయక్ జాగృతిలో చేరడం ఆనందంగా ఉందని.. ఉద్యమకారులమంతా కలిసి సామాజిక…

AP

టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ..!

టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి నారా లోకేశ్ సోమవారం ముంబయిలో భేటీ అయ్యారు. ఈ భేటీలో టాటా గ్రూప్స్ లో పలు కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో ఈ నెలలో జరిగే టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.   టాటా పవర్ రెన్యూవబుల్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేశ్…