AP

AP

ఏపీ లిక్కర్ స్కాం లో ఈడి ఎంట్రీ..! వైసీపీకి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా..?

వైసీపీకి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా? లిక్కర్ కేసులో నేతలకు దారులు మూసుకుపోతున్నాయా? నిన్నటికి నిన్న ముగ్గురు నిందితులకు ముందస్తు బెయల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఈ కేసులోని ఈడీ ఎంటరైంది. దీంతో వైసీపీ కీలక నేతల్లో అసలు టెన్షన్ మొదలైంది. ఇక తమ పని అయిపోయినట్టేనని అంటున్నారు.   వైసీపీ నేతలు బెంబేలు   వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. ఈ కేసుపై ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ,…

AP

విద్యుత్ శాఖపై జగన్ ప్రభుత్వం రూ. 1.25 లక్షల కోట్ల అప్పు చేసింది: మంత్రి గొట్టిపాటి..

దేశ భద్రత విషయంలో ప్రజలందరూ ఏకతాటిపై నిలుస్తుంటే, రాష్ట్ర ప్రగతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం ఆసక్తి ఉండటం లేదని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ తన సొంత ప్రచార సాధనాల ద్వారా నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారని, అయితే ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను విశ్వసించరని ఆయన స్పష్టం చేశారు.   గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీక్ అవర్స్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ. 9.38 చొప్పున కొనుగోలు…

AP

లిక్కర్ స్కాంపై మరో బాంబు పేల్చిన కేశినేని నాని.. !

రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో అరెస్టయిన కీలక వ్యక్తులతో కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని నాని ఆరోపించారు. ఈ మేరకు రాసిన లేఖను ఆయన…

AP

అమరావతిలో 25 వేల జాబ్స్..! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

అమరావతిలో 25 వేల ఉద్యోగాల కల్పనకు తొలిఅడుగు పడింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రజా రాజధాని అమరావతిలో ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు. ఇంతకు ఆ 25 వేల జాబ్స్ సంగతేమిటో తెలుసుకుందాం.   ఇటీవల ఏపీ ప్రజా రాజధాని అమరావతి పునః నిర్మాణానికి పీఎం మోడీ శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 2027 నాటికి రాజధాని తొలిదశ పనులు పూర్తి…

AP

మోదీ అమరావతి పర్యటనకు సర్వం సిద్ధం… డ్రోన్స్ కు నో పర్మిషన్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా భద్రతను మరింత కఠినతరం చేశారు. ఇందులో భాగంగా ప్రధాని సభ జరిగే ప్రాంతానికి, గన్నవరం విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల పరిధిని ‘నో ఫ్లై జోన్‌’గా ప్రకటించారు. ఈ మేరకు డ్రోన్‌ కార్పొరేషన్‌ అధికారులు స్పష్టం చేశారు.   ప్రధాని పర్యటన ముగిసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, ఈ పరిధిలో కనీసం…

AP

అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే… గాలిస్తున్న పోలీసులు..

వైసీపీ రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి నమోదైన కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.   ఈ కేసు విచారణ నిమిత్తం సత్యసాయి జిల్లా రాప్తాడులోని ప్రకాష్ రెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఆయన ఇంట్లో అందుబాటులో…

AP

శ్రామికులందరికీ రూ. 3 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం: పవన్ కల్యాణ్..

దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కార్మిక దినోత్సవం (మేడే) పురస్కరించుకుని ఈరోజు ఆయన శ్రామికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.   ఇకపై కార్మికులను ‘కూలీలు’ అని కాకుండా ‘ఉపాధి శ్రామికులు’ అని గౌరవంగా సంబోధించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే…

AP

జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ అధినేత జగన్ భేటీ.. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండాలని సూచన..!

జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండాలని ఆయన వారికి సూచించారు. “ఎవరి ఆదేశాలకోసమో మీరు ఎదురు చూడొద్దు, మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ ఛార్జితో కలిసి మొదట కదలాల్సింది జిల్లా అధ్యక్షులే.. రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా లోకల్ గా కార్యక్రమాలు చేయాలి, వాటితో హైలైట్ కావాలి” అని వారికి ఉద్భోదించారు. స్తబ్దుగా ఉన్న జిల్లా పార్టీ శ్రేణుల్లో కదలిక తెచ్చేందుకు జగన్…

AP

సింహాచలంలో చందనోత్సవం వేళ తీవ్ర విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి..!

విశాఖ సిటీలోని సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోక ముందే ఎనిమిది భక్తులు ఈ లోకాన్ని వదిలిపెట్టారు. భక్తులు క్యూ లైన్‌లో ఉండగా సమీపంలోకి గోడ కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.   మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. బస్టాండ్ నుంచి దేవాలయానికి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్…

AP

గ్రూప్ 1లో అక్రమాలు .. పీఎస్ఆర్‌పై మరో కేసు నమోదు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఇదివరకే ముంబయి నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టై ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.   అయితే ఆ సమయంలో గ్రూప్ 1 (2018) ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన వ్యవహారంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు…