ఖనిజ సంపదపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సమగ్రమైన ‘మినరల్ మ్యాపింగ్’ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికితీయడమే కాకుండా, వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే (వాల్యూ యాడిషన్) ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై…

