ఆస్ట్రేలియా వస్తే చంపేస్తాం… ప్రధాని మోదీకి బెదిరింపులు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు కొద్ది రోజుల ముందు ఆన్‌లైన్‌లో హత్య బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు (ఏఎఫ్‌పీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోదీ పర్యటనను, ప్రవాస భారతీయులతో జరగనున్న భారీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపు వెలువడింది. వివరాల్లోకి వెళితే, ప్రధాని మోదీ జూలై 9న మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.…

