ఏపీ పోర్టుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష: రామాయపట్నం – కడప రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి కార్గో కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పురోగతిపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టు నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం వెల్లడించారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులలో కార్యకలాపాలను వేగవంతం చేసి, 2026 డిసెంబర్ నాటికి పనులు…

