భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసీ.. ఏర్పాట్లు ఎందుకు చేయలేదు?: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..
వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సమీక్షించారు. ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా…

