జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసం: అచ్చెన్నాయుడు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పోలవరం పనులను నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించి ఉంటే రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులు వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టుపై 16 నెలల్లోనే రూ.3,500 కోట్లు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించామని అచ్చెన్నాయుడు తెలిపారు.…

