ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి–:ఈసీ..
రాజకీయ పార్టీల ఇంటింటి ప్రచారానికీ అనుమతి తీసుకోవాల్సిందేనని ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్ Suvidha.eci.gov.in వినియోగించాలని సీఈవో తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇంటింటి ప్రచారానికి, సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక,…

