AP

AP

జనసేన రెండో జాబితా సిద్దం..

జనసేనాని పవన్ పోటీ చేసెదెక్కడ. జనసేన రెండో జాబితాలు విడుదల అయ్యేది ఎప్పుడు. పార్టీ ఆశావాహులు, అభిమానులు ఈ నిర్ణయాల కోసం వేచి చూస్తున్నారు. ఇదే అంశం పైన పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు ఖరారయ్యాయి. అందులో అయిదు స్థానాల్లో పవన్ తన అభ్యర్దులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో పది నియోజకవర్గాల అభ్యర్దులను ప్రకటించేలా నిర్ణయించారు. తాను పోటీ చేసే స్థానం పైన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  …

AP

వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ 50 ఇళ్లకు ఒకరి చొప్పున నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు అధికార పార్టీ కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విపక్షాలు వాలంటీర్లను టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో అధికారం మారితే కచ్చితంగా వాలంటీర్లను తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇప్పటికే నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది.   ఈ నేపథ్యంలో…

AP

ఒక్కటైన ఆ ఇద్దరు నేతలు – చంద్రబాబు ప్లాన్ ఏంటి..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నేతల జంపింగ్స్ కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. కృష్ణా జిల్లాలో కొత్త రాజకీయం మొదలైంది. మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయనకే అక్కడ సీటు ఖాయమని ప్రచారం సాగుతోంది. దీంతో, రెండు వర్గాలుగా పని చేసిన ఉమా -బొమ్మసాని ఒక్కటయ్యారు. వసంతకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో, సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.   మైలవరంలో కొత్త లెక్కలు : మైలవరం…

AP

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు.   ఈ సందర్భంగా పీకే చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే, గతంలో ప్రశాంత్‌ కిశోర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ…

AP

ప్రధానితో సీఎం జగన్ కీలక భేటీ..

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. పొత్తుల నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీలో బీజేపీ సీట్ల పైన కసరత్తు మొదలు పెట్టిండి. టీడీపీ, జనసేన ఇప్పటికీ బీజేపీ తమతో కలిసి వస్తుందని చెబుతున్నాయి. ఇటు జగన్ ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలోనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. దీంతో, ఈ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి మొదలైంది.   పొత్తుల…

AP

మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ – ఆదేశాలివ్వండి..!!

ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఈ సమయంలో హైదరాబాద్‌ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు చట్టం తెచ్చేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని అందులో కోరారు. కేంద్రాన్ని ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.   ఉమ్మడి రాజధానిగా: కేంద్ర ప్రభుత్వం మరో…

AP

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల-మోసం చేసే వాడే మోడీ అన్న షర్మిల..

గతంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దాన్ని అమలు చేసేదీ తామేనంటోంది. ఈ మేరకు ఇవాళ తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల చేసింది. తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని తెలిపింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ ప్రకటన చేశారు. ఈ సభలో రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు.  …

AP

వైసీపీ 9వ జాబితాలో సంచలనాలు-అనూహ్యంగా సాయిరెడ్డికి- మంగళగిరిలో మళ్లీ మార్పు..

వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఇవాళ 9వ జాబితాను సీఎం జగన్ విడుదల చేశారు. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఓ ఎంపీ, రెండు అసెంబ్లీ సీట్లకు మాత్రమే ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు. ఇందులో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపికతో పాటు మంగళగిరి అసెంబ్లీ స్దానంలో మరోసారి ఇన్ ఛార్జ్ మార్పు ఉండటం సంచలనంగా మారింది. వైసీపీ ఇవాళ ప్రకటించిన ఇన్ ఛార్జ్ ల జాబితాలో కేవలం మూడు…

AP

మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ కక్ష సాధింపే… వైసీపీ సర్కారుపై చంద్రబాబు నిప్పులు..

మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్‌ను అక్రమ అరెస్ట్ ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు తెలుగుదేశం దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నాయకులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.   వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు అని విమర్శించారు. శరత్ అక్రమ అరెస్టును…

AP

ఎన్నికల్లో అభ్యర్థుల కోసం షర్మిల ఇంటర్వ్యూ..

ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ కైనా సవాలే. అన్ని రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని దక్కించుకోవడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన విజయం దక్కుతుందనే గ్యారెంటీ లేదు. ప్రజల మెప్పు పొందిన వారికే అధికారం లభిస్తుంది. లేకుంటే ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావలసి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని అనుకోదు. ఎందుకంటే అధికారం అనేది చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు. దేన్నైనా శాసించవచ్చు. ప్రస్తుతం…