కదిరిలో ఆధ్యాత్మిక వెల్లువ: స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పోటెత్తిన భక్తులు
శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పెద్దయెత్తున పాల్గొన్న భక్తులు. సనాతన ధర్మంలో ప్రకృతిని , పంచభూతాలను ఆరాధించడం మన హిందూ సాంప్రదాయం అందులో భాగంగానే ప్రతి పుణ్య క్షేత్రాలలో గిరి ప్రదక్షిణ అంత ప్రాధాన్యత సంతరించుకుంది.అందులో భాగంగానే శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో స్వయంభువుగా ప్రహ్లాద సమేతంగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి కుమ్మర వాండ్ల పల్లి గ్రామంలో…

