ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కి పెంపు..?
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోసారి పెరగనుందా? ఈ అంశంపై కొంతకాలంగా జరుగుతున్న చర్చకు విద్యాశాఖ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశం ఉందని విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ డైరెక్టర్ (జేడీ) మువ్వా రామలింగం పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి డిప్యూటీ డీఈవో ఎం. హరిప్రసాద్ పదవీ విరమణ సన్మాన సభలో మువ్వా రామలింగం ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అవుతున్న…

