సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ‘గంజాయి డాన్’గా మారిన రేణుక: విశాఖలో లేడీ స్మగ్లర్ అరెస్ట్!
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన గాదె రేణుక ఒకప్పుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ నెలకు లక్షల్లో జీతం అందుకునేది. అయితే, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమె నేర బాట పట్టింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే గంజాయి స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్న రేణుక, క్రమంగా తాను కూడా ఈ అక్రమ వ్యాపారంలోకి దిగి ‘లేడీ డాన్’గా ఎదిగింది. తాజాగా నర్సీపట్నం నుంచి శ్రీలంకకు గంజాయిని తరలిస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను, ఆమె ముఠాను పక్కా…

