శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం: రెండు రోజుల పసికందును వదిలి వెళ్ళిన కసాయి తల్లి
శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మండలం కాళసముద్రం గ్రామ సమీపంలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల పసికందును ఎవరో కసాయి తల్లి నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. పసికందును వదిలివెళ్లిన తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఆ ప్రాంతంలో గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆ పసికందును రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు…

