ఏపీలో మద్యం అమ్మకాలు: పారదర్శకత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు, సరఫరాలో మరింత పారదర్శకతను పెంచడానికి, అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీని కోసం ప్రభుత్వం ఒక కొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా, ఇప్పటివరకు మద్యం తయారీ సంస్థ (డిస్టిలరీ) నుంచి డిపోలకు చేరుకునే వరకు మాత్రమే ఉన్న ట్రాకింగ్ వ్యవస్థను వినియోగదారుడి వరకు విస్తరించాలని యోచిస్తోంది. దీని ద్వారా ప్రతి మద్యం సీసా ఎక్కడ తయారై, ఏ షాపులో అమ్ముడైందో…

