60 ఏళ్ల దాంపత్యం: భర్త మరణించిన కొద్ది గంటల్లోనే భార్య మృతి.. నంద్యాలలో విషాదం
ఇద్దరు వేర్వేరు మనుషుల్ని ఒకటి చేసి, పరిపూర్ణమైన జీవితాన్ని అందించే వివాహ బంధం మరణంలో కూడా వీడలేదు. నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన 85 సంవత్సరాల ఆరువేటి లక్ష్మీనారాయణ, వెంకట లక్ష్మమ్మ దంపతుల దాంపత్య జీవితం మరణంలో కూడా కలిసే ముగియడం అందరినీ కంటతడి పెట్టించింది. దాదాపు 60 ఏళ్ల క్రితం వివాహం పేరుతో ఒక్కటైన ఈ పండు వృద్ధ జంట, తమ చివరి ప్రయాణాన్ని కూడా కలిసే కొనసాగించింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో…

