AP

AP

పశుసంవర్థక రంగంలో ఓ అరుదైన ఘట్టం..! కృష్ణా జిల్లాలో పుట్టిన తొలి టెస్ట్ ట్యూబ్ దూడ..

పశుసంవర్థక రంగంలో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) టెక్నాలజీ ద్వారా ఓ కోడెదూడ జన్మించింది. మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పశువైద్య అధికారులు, రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దేశీయ గో జాతులను అభివృద్ధి చేసి, పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.   ప్రయోగం జరిగిందిలా.. పశుగణాభివృద్ధి విభాగం అధికారులు గుంటూరు లాంఫాంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.…

AP

టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ..!

టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి నారా లోకేశ్ సోమవారం ముంబయిలో భేటీ అయ్యారు. ఈ భేటీలో టాటా గ్రూప్స్ లో పలు కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో ఈ నెలలో జరిగే టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.   టాటా పవర్ రెన్యూవబుల్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేశ్…

AP

తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక ట్విస్ట్ లు..!

ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్రదారులుగా గుర్తించిన అధికార పార్టీ నాయకులను పార్టీ సస్పెండ్‌ చేసింది. పలువురు వ్యక్తులు అరెస్ట్‌ అయ్యారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీకి విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు కూటమి నేతలు.   ఏపీ కల్తీ మద్యం కేసులో రాజకీయ దుమారం.. ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేసిన సీఐ   మొత్తం 12 మంది…

AP

చైల్డ్ కేర్ సెంటర్ లో శిశువు మరణంపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు తీవ్రమైన ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని ప్రభుత్వ శిశుగృహంలో ఏడాదిన్నర బాలుడు మృతి చెందడం, పార్వతీపురం మన్యం జిల్లాలోని గురుకుల పాఠశాలలో 85 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడంపై ఆయన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి. సంధ్యారాణితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.   అనంతపురం…

AP

కిలో టమాటా ఒక్క రూపాయి… కర్నూలు జిల్లాలో రైతుల ఆగ్రహం..

కంటికి రెప్పలా కాపాడుకున్న పంటకు కనీస ధర కూడా దక్కకపోవడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో ధర కేవలం రూపాయికి పడిపోవడంతో ఆగ్రహించిన రైతులు, తాము పండించిన టమాటాలను రోడ్డుపై పారబోసి తీవ్ర నిరసన చేపట్టారు. టమాటాలతో నిండిన బుట్టలను రహదారిపై కుమ్మరించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.   ఈ నిరసన కారణంగా పత్తికొండలోని గుత్తి-మంత్రాలయం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రైతులు…

AP

ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై రంగంలోకి డిప్యూటీ సీఎం..!

కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ తో ఎమ్మెల్సీ హరిప్రసాద్, పిఠాపురం ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నేతలు భేటీ అయ్యి పిఠాపురం అభివృద్ధి పనులపై చర్చించారు. మత్స్యకారుల సమస్యలు, కంపెనీల కాలుష్యంపై కలెక్టర్ తో నేతలు చర్చించారు.   మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై ఈ సమావేశం చర్చించారు. వచ్చే నెల 10లోగా…

AP

ఆక్వాకల్చర్ అభివృద్ధి పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ (APSADA) సభ్యుల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   వివిధ జిల్లాల నుండి, మత్స్య పరిశ్రమకు సంబంధించిన విభిన్న రంగాల ప్రముఖులను ప్రభుత్వం సభ్యులుగా నియమించింది.   సభ్యులుగా నియమితులైన వారిలో దేశంసెట్టి వెంకట లక్ష్మీ నారాయణ (అమలాపురం, ప్రాసెసింగ్ ప్లాంట్లు విభాగం), గుట్టికొండ శ్రీ రాజబాబు (గుడివాడ, ఫీడ్ తయారీదారులు), లంకే నారాయణ ప్రసాద్…

AP

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా… 23 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వి. అయ్యన్న పాత్రుడు శనివారం ప్రకటించారు. ఈ సెషన్‌లో మొత్తం 23 బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించడం విశేషం.   ఈ సమావేశాలు మొత్తం 8 రోజుల పాటు 45 గంటల 53 నిమిషాల పాటు కొనసాగాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు.…

AP

పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా… సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

పర్యాటక రంగంతోనే రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు…

AP

సుగాలి ప్రీతి కేసులో కీలక పరిణామం.. మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్..

ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏళ్లుగా విచారణలో ఉన్న ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఇకపై సీబీఐ చేపట్టనుంది.   వివరాల్లోకి వెళితే… 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్…