AP

AP

జగన్ అక్రమాస్తుల కేసు: రూ. 793 కోట్ల దాల్మియా ఆస్తుల జప్తును సమర్థించిన అథారిటీ..

వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడాన్ని అడ్జుకేటింగ్ అథారిటీ సమర్థించింది.   దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్‌కు కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నపురాయి గనులను ప్రభుత్వం లీజుకు కేటాయించింది. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ, జగన్‌కు చెందిన కంపెనీలలో భారీగా పెట్టుబడులు…

AP

వైసీపీ ‘డిజిటల్ బుక్’.. అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తామన్న జగన్..

అధికార టీడీపీ కూటమిపై ప్రతిపక్ష వైసీపీ రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. తమ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేసేందుకు ‘డిజిటల్ బుక్’ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేది…

AP

రికార్డు సమయంలో మెగా డీఎస్సీ పూర్తి.. నేడు 16 వేల మందికి నియామక పత్రాలు..

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర చరిత్రలోనే అపూర్వమైన వేగంతో, కేవలం 150 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం, ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలు అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి అమరావతిలోని సచివాలయం సమీపంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ బడుల్లో త్వరలో విధుల్లో చేరనున్న కొత్త ఉపాధ్యాయులతో రాష్ట్రంలో కొలువుల పండుగ వాతావరణం నెలకొంది.   సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్…

AP

విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. 12,000 ఉద్యోగాలతో ..

ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కన్సల్టెన్సీ సంస్థ ‘యాక్సెంచర్’ వైజాగ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇక్కడ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసి, సుమారు 12,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని యోచిస్తున్నట్లు ప్రతిపాదించింది. ఈ మేరకు తమకు పది ఎకరాల భూమిని ఎకరా 99 పైసల నామమాత్రపు లీజుకు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ…

AP

ఏపీకి పెట్టుబడుల వెల్లువ… దిగ్గజ కంపెనీలు రావడం ఖాయం: లోకేశ్..

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ‘ఆర్థిక ఉగ్రవాదం’ నడిచిందని, ప్రభుత్వ విధానాల కొనసాగింపు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన…

AP

‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ’పై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్..

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై గత కొంతకాలంగా నెలకొన్న ఆందోళనలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలి వేదికగా తెరదించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రణాళిక ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కర్మాగారం పునరుద్ధరణ కోసం రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో…

AP

సంచలన పరిణామం… మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైసీపీ..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన ఓ కీలక తీర్మానం సభలో సంచలనం సృష్టించగా, ప్రతిపక్ష వైసీపీని ఇరకాటంలో పడేసింది. అనూహ్యంగా, ఆ తీర్మానానికి వైసీపీ మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది.   విశాఖ స్టీల్ ప్లాంట్…

AP

మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు పీపీపీ నిర్ణయం..!

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసే నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇది ప్రైవేటీకరణ కాదని, బెదిరింపులకు భయపడి మంచి నిర్ణయాలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.   పీపీపీ విధానం వల్ల ఎవరికీ నష్టం జరగదని సీఎం భరోసా ఇచ్చారు. “హైవేలను పీపీపీ…

AP

ఏపీలో నో ప్లాస్టిక్..! సర్కార్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌ ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టేందుకు త్వరలోనే పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించబోతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి శాసనసభలో అడిగిన ప్రశ్నకు ఆయన కీలక సమాధానం చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, గ్రౌండ్ లెవల్ లో అది సరిగా అమలు కావడం లేదన్నారు.   ప్లాస్టిక్…

AP

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఆర్‌ఐ, సర్వేయర్..

వనపర్తి జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.   వివరాల్లోకి వెళితే, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సి. వాసు, మండల సర్వేయర్ నవీన్ రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.40,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి తన బంధువులకు చెందిన భూమికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ జారీ చేయాలని…