విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. 12,000 ఉద్యోగాలతో ..
ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కన్సల్టెన్సీ సంస్థ ‘యాక్సెంచర్’ వైజాగ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇక్కడ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసి, సుమారు 12,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని యోచిస్తున్నట్లు ప్రతిపాదించింది. ఈ మేరకు తమకు పది ఎకరాల భూమిని ఎకరా 99 పైసల నామమాత్రపు లీజుకు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ…

