స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి స్తోత్రాద్రికి పెద్దయెత్తున గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు.
నవనారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం.శ్రీ స్వామి వారు కదిరి పట్టణానికి సమీప దూరంలో కొండల లక్ష్మీ నారసింహుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని అందుకే ఈ క్షేత్రానికి “ఖాద్రీపురం” అనే పేరు వచ్చిందని ‘ఖ’ అనగా విష్ణుపాదం ‘అద్రి’ అనగా పర్వత. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రహ్లాద సమేతంగా దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ఖాద్రీ పురాణంలో పేర్కొనబడింది…

