AP

AP

ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి..

పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్మిక భద్రత అంతే ముఖ్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మిక భద్రతా ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు, బీఐఎస్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం మరియు గట్టి భద్రతా ఆడిట్ శిక్షణ (IS 14489:2018 ప్రకారం)’ కార్యక్రమాన్ని నిన్న విజయవాడలోని హయత్ ప్లేస్ హోటల్‌లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్, కర్మాగార శాఖ ఏపీసీఎఫ్ఎస్ఎస్ సహకారంతో రూపొందించిన ‘factories’ యాప్‌ను ప్రారంభించారు.…

AP

భవిష్యత్ టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతి..!

అమరావతిలో పెద్ద ప్రాజెక్ట్ మొదలైంది. దీనితో మూడు నగరాలకు ఊహించని కనెక్టివిటీ పెరగనుంది. అంతేకాదు ఇక్కడ ఎందరో విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే చాలు, జై అమరావతి.. జైజై రాజధాని అనేస్తారు. ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏమిటో తెలుసుకోండి. మన రాజధాని అద్భుతాన్ని తెలుసుకొని, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిద్దాం.   రాష్ట్ర రాజధాని అమరావతిని ఇప్పుడు దేశానికి గర్వకారణంగా మార్చే పనిని ఏపీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నిర్మాణం ఆగిపోయిందని…

AP

బుద్ధి మార్చుకోని జర్నలిస్ట్ కృష్ణంరాజు.. ఆధారాలున్నాయంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే యత్నం..

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే, ఆ తర్వాతైనా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. కానీ, అమరావతి మహిళలను ఉద్దేశించి గతంలో సాక్షి చానెల్‌లో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. పైగా, తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు మరింత వివాదాస్పద చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆయన తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవిగోనంటూ కొన్ని పాత వార్తా కథనాలను చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   గతంలో…

AP

అమరావతిని వేశ్యల రాజధాని అన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు… రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు..

అమరావతి మహిళలను కించపరిచేలా ‘సాక్షి’ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు, వాటిని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సాక్షి’ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుపై నిన్న అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతులు, మహిళలు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.   రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఫిర్యాదులు నిన్న రాష్ట్రంలోని…

AP

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు నమోదు..!

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తులూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.   వైకాపా ప్రభుత్వ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటెయినర్ల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని…

AP

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..! యాంకర్ కొమ్మినేని అరెస్టు..

అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. కొమ్మినేనిని ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై సాక్షి టీవీ చర్చలో మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో…

AP

పిఠాపురం నియోజకవర్గ యువతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్..!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త తెలిపారు. పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.   మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురానికి చెందిన 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. విద్యుత్ పనులు చేసే సమయంలో ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా రక్షణ పరికరాలు వాడాలని సూచించారు.  …

AP

జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారు: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ..

జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారని, తప్పుడు కేసులు పెట్టించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గుంటూరు జనచైతన్య వేదిక హాలులో ‘పోలీసు వ్యవస్థలో సంస్కరణలు’ అనే అంశంపై నిన్న జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.   జగన్‌పై అనేక కేసులు ఉన్నా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ఏడేళ్లుగా న్యాయస్థానానికి వెళ్లడం లేదన్నారు. పోలీసు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే మెరుగైన…

AP

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం జరగాల్సి ఉన్న కోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది. బెయిల్ ఇవ్వాల‌ని నిందితులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై విజ‌య‌వాడ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం తదుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వంటి దర్యాప్తు సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక కేసులో తమ విచారణను…

AP

ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. శుక్రవారం నాడు సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన అజెండాగా ఈ భేటీ సాగింది.   ఈ సందర్భంగా, 8 జిల్లాలను కలుపుతూ విశాఖపట్నం కేంద్రంగా…