AP

AP

ముఖ్యమంత్రి చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ..! కారణం అదేనా..?

2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసును సీబీఐ చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు ఓ కొలిక్కిరాలేదు. తన తండ్రి హంతకులకు శిక్ష పడేందుకు వివేకా కుమార్తె వైఎస్ సునీత సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు.   తాజాగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకా హత్య కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2024 సెప్టెంబరులో కూడా సునీత, తన భర్తతో…

AP

వైసీపీ నేత పెద్దిరెడ్డిని కలవడంపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివరణ..! ఏమన్నారంటే..?

టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎయిర్ పోర్టులో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొలికపూడి వైసీపీలో చేరుతున్నారా? అనే కోణంలో చర్చ జరిగింది. దీనిపై కొలికపూడి వివరణ ఇచ్చారు. ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనం కోసం తాము హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చామని, ఆ సందర్భంగా అదే ఇండిగో విమానంలో పెద్దిరెడ్డి కుటుంబం కూడా ప్రయాణించిందని వెల్లడించారు. దాంతో మర్యాదపూర్వకంగా, బాగున్నారా సార్ అని పలకరించానని,…

AP

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం… కీలక నిర్ణయాలు ఇవిగో..!

టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. శ్రీ వారి భక్తులకు సేవలను మరింతగా పటిష్ఠం చేయటం పైన చర్చించారు. భక్తులకు వసతి పెంపు తో పాటుగా సీఎం ఆదేశాల మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. అలిపిరి వద్ద మౌలిక వసతులతో పాటుగా.. వసతి గురించి సమావేశంలో చర్చ జరిగింది. పెరుగు తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం పై బోర్డు…

AP

ఏపీ మామిడి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనతో తోతాపురి మామిడి రైతుల కష్టాలపై మొదలైన చర్చకు కేంద్రం ముగింపు పలికింది. తోతాపురి రైతులకు మద్దతు ధర విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం దీనికి ఓ పరిష్కారం చూపింది. తోతాపురి మామిడి పళ్లకు మద్దతు ధరను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయాల సంగతి ఎలా ఉన్నా రైతులకు మాత్రం ఊరట లభించనుంది.   ఈ ఏడాది తోతాపురి మామిడికి…

AP

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… విచారణకు హాజరు కాలేనన్న మాజీ మంత్రి నారాయణస్వామి..

లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు నారాయణస్వామి సమాచారం అందించారు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు విచారణకు హాజరు కాలేనని…

AP

వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది: వైవీ సుబ్బారెడ్డి..

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. లేని లిక్కర్ కేసును బనాయించి వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ… తమ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని… ఇది చాలా దారుణమని సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో ఎక్సైజ్ పాలసీపై…

AP

సాక్షిలో పొగాకు పై కథనాలు..! మీకేం తెలుసు..? జగన్ ను ప్రశ్నిస్తూ పొగాకు రైతుల లేఖ..!

సాక్షి పత్రికలో వచ్చిన కొన్ని కథనాల పట్ల పొగాకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కు సాక్షి పత్రిక మేనేజ్ మెంట్ కు లేఖ రాశారు. పొగాకు సాగు చేయని వారిని బాధితులుగా చూపించడం ఏంటని నిలదీశారు. జగన్ కు బ్లాక్ బర్లీ పొగాకు రైతుల కష్టాలు తెలుసా? పొగాకు రైతుల కష్టాలను జగన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? అని రైతులు ప్రశ్నించారు.   తప్పుడు వార్తలతో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసే కథనాలు…

AP

ఢిల్లీలో చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్..

స్వర్ణాంధ్ర 2047 సాకారం అయ్యేందుకు భవిష్యత్ ప్రణాళికగా ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. మొత్తం 120 సిఫార్సులను పొందుపరచిన ఈ నివేదికను టాస్క్ ఫోర్సు బృందం రూపొందించింది. మొత్తం 17 రంగాలకు సంబంధించి అమలు చేయాల్సిన సిఫార్సులను టాస్క్ ఫోర్సు ఇందులో నివేదించింది. ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక…

AP

మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు..

విశాఖ పోలీసులు మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతీ యువకులను కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్ వంటి దక్షిణాసియా దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న పలువురిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగులను విదేశాలకు అక్రమ రవాణా చేస్తోన్న పలువురిని అరెస్టు చేశామని, వారి చేతుల్లో మోసపోయిన 85 మంది అమాయకులను స్వదేశానికి సురక్షితంగా రప్పించామని…

APNationalTELANGANA

బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు..

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ జలవివాదాలపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై సీఆర్ పాటిల్ తెలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. గోదావరి…