రేపటి నుంచే ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రేపటి నుంచి (ఏప్రిల్ 1) రాష్ట్రవ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా సుమారు 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. చేనేత రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి, నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ‘పవర్’ గిఫ్ట్…

