AP

AP

ఏపీ టూరిజంపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త రూపునిచ్చి, ప్రపంచ పటంలో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, అనంతపురంలో ప్రపంచ ప్రఖ్యాత ‘డిస్నీ వరల్డ్ సిటీ’ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు కేవలం…

AP

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి సుగాలి ప్రీతి కేసు..

2017లో తెలుగు రాష్ట్రాల్లో సంచలం రేపిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి ఇచ్చినా దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే ప్రీతి కుటుంబానికి న్యాయం…

AP

ఏపీలో విద్యుత్ ప్రమాదాల నివారణకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు..

విద్యుత్ ప్రమాదాల శాశ్వత నివారణే లక్ష్యంగా ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు పనిచేయాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.   మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా కొందరు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.…

AP

ఎటుచూసినా అమరావతి ఆకర్షణీయంగా ఉండాలి: సీఆర్డీఏకి చంద్రబాబు దిశానిర్దేశం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాజధానిలో చేపట్టాల్సిన ప్రధాన ప్రాజెక్టులను సకాలంలో, పూర్తిచేయడమే లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (స్పెషల్ పర్పస్ వెహికల్ – ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 52వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. మొత్తం 7 కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి,…

AP

బీఆర్ఎస్ కు పట్టిన గతే జనసేనకు పడుతుంది!: సీపీఐ నారాయణ హెచ్చరిక..

బీజేపీతో జతకట్టే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బీజేపీ అందించేది అభయహస్తం కాదని, అది పార్టీలను నాశనం చేసే ‘భస్మాసుర హస్తం’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.   ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి, వాటిలో చీలికలు తీసుకురావడమే బీజేపీ వ్యూహమని నారాయణ ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. బీజేపీకి…

AP

భవిష్యత్తును ఊహించి ముందుకెళ్లే దార్శనికుడు సీఎం చంద్రబాబు: పవన్ కల్యాణ్..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. చంద్రబాబు దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయం అని కొనియాడారు.   “భవిష్యత్తును ఊహించి ప్రణాళికబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దార్శనికుడు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం…

AP

కూటమి 15 ఏళ్లు కొనసాగాలి… జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన పవన్..!

ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక విజయం తర్వాత జనసేన పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దకాలానికి యువ నాయకత్వాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా కీలక కార్యాచరణను ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి సుస్థిర పాలన అందించేందుకు ప్రస్తుత ఎన్డీయే కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ…

AP

రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు: సీఎం చంద్రబాబు..

“రాష్ట్ర అభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల్లా తయారయ్యారు. ప్రతి మంచి పనికీ తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. చేతనైతే అభివృద్ధి, సంక్షేమంలో మాతో పోటీ పడాలి తప్ప, ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం సరికాదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల కుప్పం ప్రజల కలను సాకారం చేస్తూ, హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను నియోజకవర్గానికి తీసుకువచ్చిన చారిత్రక సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీళ్లు…

AP

కుప్పం ప్రజలకు గుడ్ న్యూస్..! కుప్పం అభివృద్ధికి 6 కీలక ఎంవోయూలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టనుంది. పారిశ్రామికంగా కుప్పం రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఏకంగా విమానాలు, రాకెట్ల తయారీ యూనిట్లతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఫైబర్ బోర్డు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కుప్పం పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలతో మొత్తం 6 కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా కుప్పంలోకి రూ. 2,050 కోట్లకు…

AP

ఏపీలో రూ. 53 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం..! ఏపీలో కొలువుల జాతర..!

ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ వేగంగా పారిశ్రామిక ప్రాజెక్టులు పూర్తవ్వాలన్న ముఖ్యమంత్రి ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక…