AP

AP

మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన..

దేశంలో అత్యుత్తమ మోడల్ తో మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు నిర్మాణంచేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుపై అధికారులతో మంత్రి సమీక్షించారు.   ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల…

AP

ఏపీలో రెండు మెట్రో ప్రాజెక్టులకు కీలక ముందడుగు..

ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. ఈ దిశగా నేడు కీలక ముందుడుగు పడింది. ఈ రెండు ముఖ్య నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.   మొత్తం రూ.21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.10,118 కోట్లతో…

AP

ఉప్పాడ తీరంలో రాకాసి అలలు..! జలమయంగా మాయపట్నం..

ఉప్పాడ తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం ఉప్పొంగడంతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామం జలమయంగా మారింది. సముద్రపు నీరు గ్రామంలోకి చొచ్చుకు రావడంతో 20 ఇళ్లు కూలిపోయాయని గ్రామస్తులు తెలిపారు. సముద్రపు నీరు దాదాపు 70 ఇళ్లలోకి చేరిందని, బయట అడుగుపెట్టే వీలులేకుండా పోయిందని వాపోయారు. తీర ప్రాంతంలో రక్షణ గోడలు, జియో ట్యూబ్ ధ్వంసం కావడం వల్లే గ్రామంలోకి సముద్రపు నీరు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. మాయపట్నం గ్రామానికి చేరుకున్న అధికారులు…

AP

ముఖ్యమంత్రి చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ..! కారణం అదేనా..?

2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసును సీబీఐ చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు ఓ కొలిక్కిరాలేదు. తన తండ్రి హంతకులకు శిక్ష పడేందుకు వివేకా కుమార్తె వైఎస్ సునీత సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు.   తాజాగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకా హత్య కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2024 సెప్టెంబరులో కూడా సునీత, తన భర్తతో…

AP

వైసీపీ నేత పెద్దిరెడ్డిని కలవడంపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివరణ..! ఏమన్నారంటే..?

టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎయిర్ పోర్టులో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొలికపూడి వైసీపీలో చేరుతున్నారా? అనే కోణంలో చర్చ జరిగింది. దీనిపై కొలికపూడి వివరణ ఇచ్చారు. ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనం కోసం తాము హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చామని, ఆ సందర్భంగా అదే ఇండిగో విమానంలో పెద్దిరెడ్డి కుటుంబం కూడా ప్రయాణించిందని వెల్లడించారు. దాంతో మర్యాదపూర్వకంగా, బాగున్నారా సార్ అని పలకరించానని,…

AP

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం… కీలక నిర్ణయాలు ఇవిగో..!

టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. శ్రీ వారి భక్తులకు సేవలను మరింతగా పటిష్ఠం చేయటం పైన చర్చించారు. భక్తులకు వసతి పెంపు తో పాటుగా సీఎం ఆదేశాల మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. అలిపిరి వద్ద మౌలిక వసతులతో పాటుగా.. వసతి గురించి సమావేశంలో చర్చ జరిగింది. పెరుగు తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం పై బోర్డు…

AP

ఏపీ మామిడి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనతో తోతాపురి మామిడి రైతుల కష్టాలపై మొదలైన చర్చకు కేంద్రం ముగింపు పలికింది. తోతాపురి రైతులకు మద్దతు ధర విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం దీనికి ఓ పరిష్కారం చూపింది. తోతాపురి మామిడి పళ్లకు మద్దతు ధరను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయాల సంగతి ఎలా ఉన్నా రైతులకు మాత్రం ఊరట లభించనుంది.   ఈ ఏడాది తోతాపురి మామిడికి…

AP

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… విచారణకు హాజరు కాలేనన్న మాజీ మంత్రి నారాయణస్వామి..

లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు నారాయణస్వామి సమాచారం అందించారు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు విచారణకు హాజరు కాలేనని…

AP

వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది: వైవీ సుబ్బారెడ్డి..

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. లేని లిక్కర్ కేసును బనాయించి వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ… తమ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని… ఇది చాలా దారుణమని సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో ఎక్సైజ్ పాలసీపై…

AP

సాక్షిలో పొగాకు పై కథనాలు..! మీకేం తెలుసు..? జగన్ ను ప్రశ్నిస్తూ పొగాకు రైతుల లేఖ..!

సాక్షి పత్రికలో వచ్చిన కొన్ని కథనాల పట్ల పొగాకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కు సాక్షి పత్రిక మేనేజ్ మెంట్ కు లేఖ రాశారు. పొగాకు సాగు చేయని వారిని బాధితులుగా చూపించడం ఏంటని నిలదీశారు. జగన్ కు బ్లాక్ బర్లీ పొగాకు రైతుల కష్టాలు తెలుసా? పొగాకు రైతుల కష్టాలను జగన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? అని రైతులు ప్రశ్నించారు.   తప్పుడు వార్తలతో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసే కథనాలు…