నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు సమావేశం జరగనుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ల సమావేశంలో సీసీఎల్ఏ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. తొలి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…

