వేట్లపాలెం బాణసంచా ఘోరం: 23కు చేరిన మృతుల సంఖ్య – సహాయక చర్యల్లో జాప్యమే శాపమా?
కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 23కు చేరుకోగా, పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న తర్వాత సుమారు రెండు గంటల పాటు బాణసంచా సామాగ్రి వరుసగా పేలుతూనే ఉండటంతో, అగ్నిమాపక సిబ్బంది గానీ, స్థానికులు గానీ లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టే వీలు లేకుండా పోయింది. ఈ వరుస…

