AP

AP

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్రమంతా తెలుసు.. షర్మిల సంచలన వాఖ్యలు..

వెన్నుపోటు అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్…. ఆ పదానికి పేటెంట్ హక్కులు కూడా ఆయనకే దక్కుతాయి” అంటూ ఏపీ కాంగ్రెస్ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో, ఇవాళ వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించడంపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.వైసీపీ నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ఎలాంటి అర్థం లేదని, రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకొని వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఎవరిదో…

AP

అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం… అధికారులకు మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు..

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించలేని భారీ పెట్టుబడులను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కేవలం 11 నెలల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రానికి తీసుకువచ్చిందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, ఉపాధి కల్పన మంత్రుల కమిటీ ఛైర్మన్ నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంపై ఏర్పాటు చేసిన మంత్రులు, ఉన్నతాధికారుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు…

AP

జూన్ 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమం: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, జూన్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.   ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతో పాటు…

AP

జగన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్..!

విశాఖలో ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులపై వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వాటి నుంచి తప్పించుకోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని ఆయన…

AP

మంగళగిరిలో త్వరలోనే రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీ… మంత్రి నారా లోకేశ్ సమీక్ష..

మంగళగిరి నియోజకవకర్గంలో త్వరితగతిన రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి మొదటి విడతగా సుమారు 3 వేల మందికి శాశ్వత…

AP

బుగ్గమఠం భూములపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి .. ఏపీ సర్కార్‌కు నోటీసులు..

బుగ్గమఠం భూముల వివాదంపై వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ మఠం కార్యనిర్వహణ అధికారి (అసిస్టెంట్ కమిషనర్) జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత నెల 22న ఉత్తర్వులు జారీ…

AP

ఏపీలో రేషన్ సరకుల పంపిణీలో మార్పులు..!

రేషన్ సరకుల వ్యవహారం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులకు బదులుగా ఇంటివద్దకే వాహనంలో వచ్చి సరకులు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు ఏడాదిగా అదే పద్ధతి కొనసాగించారు. కానీ ఇప్పుడు రేషన్ వాహనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాబోయే మార్పులపై ఇప్పుడు చర్చ మొదలైంది. రేషన్ వాహనాలు నిలిపివేయడం సంచలన నిర్ణయమే. ఇప్పటి వరకు ఇంటి వద్దనే, లేదా వీధి…

AP

ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం.. 71,380 స్పౌజ్ పింఛ‌న్ల మంజూరు..

ఏపీలోని కూట‌మి ప్రభుత్వం ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పౌజ్ కేటగిరీ కింద కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఎన్‌టీఆర్ భ‌రోసా పింఛన్ల పథకంలో భాగంగా స్పౌజ్ కేటగిరీ కింద 71, 380 మందికి కొత్తగా పింఛన్లు అందించనున్నారు.   సామాజిక భ‌ద్ర‌త పింఛ‌ను తీసుకుంటున్న భ‌ర్త చ‌నిపోతే… అత‌ని భార్య‌కు ఆ త‌దుప‌రి నెల నుంచే పింఛ‌ను అందించేలా స్పౌజ్ కేటగిరీని…

AP

ఫ్యాన్ లేదు.. లాక‌ప్‌లో దోమ‌లు కుడుతున్నాయి: కోర్టులో నందిగం సురేశ్ పిటిష‌న్..

తుళ్లూరు పీఎస్ లాకప్‌లో ఫ్యాన్ లేకపోవ‌డంతో దోమ‌లు కుడుతున్నాయ‌ని మంగ‌ళ‌గిరి కోర్టులో నందిగం సురేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. లాక‌ప్‌లో ఫ్యాను, దోమ‌ల మందు వినియోగించుకునేందుకు అనుమతించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్‌పై గురువారం మంగ‌ళ‌గిరి కోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి.   తుళ్లూరు సీఐ శ్రీనివాస‌రావు కోర్టుకు హాజ‌రయ్యారు. లాక‌ప్ రూమ్‌లోకి ఫ్యాన్‌, పొగ‌వ‌చ్చే దోమ‌ల మందులు, విద్యుత్ దీపాల‌ను వినియోగించ‌డానికి నిబంధ‌న‌లు అనుమ‌తించ‌వ‌ని న్యాయ‌స్థానానికి వివ‌రించారు. లాక‌ప్ బ‌య‌ట నుంచి గాలి వ‌చ్చేలా టేబుల్…

AP

మీ ఆటలు ఇక సాగవు: సీఎం చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో జరుగుతున్న మహానాడు రెండవ రోజు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పల్నాడు, ప్రకాశం జిల్లాలలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేతల హత్యలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.   ఈ హత్యలపై తనకు అనుమానం వచ్చిందని ఆయన అన్నారు. తాను ఇప్పుడు ఎవరినీ నమ్మడం లేదని స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని మనసులో అనుమానంతో ఆలోచిస్తే, కొందరు మన దగ్గరే ఉంటూ వారికి కోవర్టులుగా…