జూన్ 4న వెన్నుపోటు దినం విజయవంతం చేయాలంటూ సజ్జల కామెంట్స్..!
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతోంది. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా, జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని ‘వెన్నుపోటు దినం’గా నిర్వహించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి…

