AP

AP

వైఎస్ జగన్ మీడియా సమావేశం..! కారణం అదేనా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం రాజకీయంగా ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమి మాట్లాడతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వైఎస్సార్‌సీపీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రజలకు కొన్ని కీలక సందేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేసిన…

AP

నూతన రేషన్ విధానంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి నాదెండ్ల..

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) ద్వారా ఇంటింటికీ రేషన్ అందించే ప్రక్రియను నిలిపివేసి, తిరిగి చౌకధరల దుకాణాల (రేషన్ షాపుల) ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.   రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల…

AP

జగన్ 2.O వస్తది.. అప్పుడు ఒక్కొక్కరికి?: జగన్ సంచలన వ్యాఖ్యలు..

మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని.. జగన్ 2.Oలో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   ‘ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారు. వంశీ, నందిగం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలను వేధిస్తున్న వారికి సినిమా చూపిస్తాం. రిటైరైనా, దేశం విడిచి వెళ్లినా రప్పిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల…

AP

జిల్లాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు..

జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రులతో జిల్లాల పునర్విభజనపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో, కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు వివిధ సంఘాల వారిని భాగస్వాములను…

AP

ఏపీలోని ఆ జిల్లాల్లో ఉగ్ర కదలికలు..? సీఎస్, డీజీపీకి పవన్ లేఖలు..!

కేంద్రం పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏపీలోని విజయనగరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. విజయనగరానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారు ఐసిస్ ఆదేశాలతో బాంబులు తయారు చేసినట్లు గుర్తించారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ ఘటనపై స్పందించారు. సీఎస్, డీజీపీలకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. ఇందులో పలు కీలక అంశాల్ని పవన్ ప్రస్తావించారు.   జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని అన్ని జిల్లాల్లో…

AP

అరెస్టుల వేళ జగన్ వరుస భేటీలు..! కారణం అదేనా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.   జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. క్యాడర్‌లో…

AP

నందిగం సురేష్ అరెస్ట్.. తుళ్లూరు డీఎస్పీ కీలక వ్యాఖ్యలు..

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ఉద్దండరాయునిపాలెం గ్రామంలోని బొడ్డురాయి సెంటర్లో నిలబడి ఉన్న రాజు అనే వ్యక్తిపై నందిగం సురేష్, అతని అన్న మరో ఇద్దరు కారుతో గుద్దారని తెలిపారు. పాత కక్షలు ఉండటంతోనే దాడి చేశారు.. సురేష్ సోదరులు రాజును కొట్టి బైకుపై ఇంటికి తీసుకుని వెళ్లారు.. ఇంటి దగ్గర కూడా పడేసి కాళ్లతో బాధితుడు రాజును కొట్టడం జరిగింది.. రాజును చంపి కృష్ణా…

AP

రాజధాని అమరావతిలో మరో కీలక ప్రాజెక్ట్..?

ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిలో ఇప్పటికే కీలక ప్రాజెక్టుల్ని తెరపైకి తెస్తున్న ప్రభుత్వం.. వాటిని గ్రౌండ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కొత్త ప్రాజెక్టుల్నీ ప్రతిపాదిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ అమరావతి రాజధానిలో సెమీ హైస్పీడ్ సర్కులర్ రైల్ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే విజయవాడ-గుంటూరు నగరాలను కలుపుతూ…

AP

ప్ర‌ధాని మోదీ నుంచి స‌ల‌హాలు తీసుకున్నా మంత్రి నారా లోకేశ్..

ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన విష‌యం తెలిసిందే. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో ఢిల్లీ రావాలని మంత్రి లోకేశ్‌ను ఆహ్వానించిన సందర్భంగా ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.   ఈ సందర్భంగా ‘యువగళం’ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు ముందు లోకేశ్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్‌లో…

AP

అక్టోబర్ 2 నాటికి చెత్త లేని పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు..

స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌ను సందర్శించి రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పలు కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ప్రకటించారు.   నెట్‌ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని…