తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్..!
తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ నెలకొంది. ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని ఓ ఫౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. 24 గంటల్లో 10 వేల కోళ్లు మృతి చెందినట్లు లెక్కలు వేశారు. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని వెటర్నరీ అధికారులు సూచించారు. దీంతో చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టారు ఫౌల్ట్రీ యజమాని. మరోవైపు.. గోదావరి జిల్లాల్లో…

