‘స్వచ్ఛ ఆంధ్ర’ ఏప్రిల్ నెల థీమ్ ను వెల్లడించిన సీఎం చంద్రబాబు..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ప్రతి నెల 3వ శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకోసం వివిధ థీమ్ లను అనుసరిస్తున్నారు. ఏప్రిల్ నెల థీమ్ ను తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నాడు జరుపుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెలా…

