AP

AP

బెట్టింగ్ యాప్ డౌన్ లోడర్లకు ఏపీ సర్కార్ షాక్..!

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ను జనం డౌన్ లోడ్ చేసుకోకుండా నిషేధించే పరిస్ధితి లేకపోవడంతో దానికి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేయిస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలంటేనే భయపడే పరిస్ధితి తీసుకురానుంది.…

AP

కొత్త జిల్లాల పై చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగం గా ముఖ్యమంత్రి కొత్త జిల్లాల్లో పాలన పైన పలు సూచనలు చేసారు. కొత్త జిల్లాల్లో అధికారులకు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాతో సంబంధం లేకుండా అధికారాలు కేటాయించాలని ఆదేశించారు. స్వేచ్ఛగా వారు విధులు నిర్వహించే వెసులుబాటు ఉండాలని స్పష్టం చేసారు. ఈ మేరకు సంబం ధిత ఆదేశాలను హెచ్‌ఓడీలు రెండు రోజుల్లో జారీ చేయాలని ఆదేశించారు.   కొత్త జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు…

AP

విశాఖలో లులూ మాల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎట్టకేలకు విశాఖలో లులూ మాల్‌కు లైన్ క్లియర్ అయ్యింది. దీనికి సంబంధించి ఆ గ్రూప్ ముందుకు రావడం, వెంటనే చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. ఆపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపో మాపో మాల్‌కు శంకుస్థాపన జరగనుంది. ఎందుకు లులూ మాల్ విషయంలో డిలే అవుటోంది? అన్నదే అసలు చర్చ.   అసలు ఏం జరిగింది?   2018లో టీడీపీ సర్కార్ లులూ గ్రూపుకు విశాఖలో స్థలం కేటాయించింది. మాల్…

AP

ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం..

బెట్టింగ్ యాప్ లు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. వీటి బారిన పడిన ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యాప్ లను సినీ నటులు, యూట్యూబర్లు, క్రీడాకారులు ప్రమోట్ చేస్తుండటంతో… ఎంతోమంది వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారి బెట్టింగ్ వలలో పడ్డారంటే… ఇక బయట పడటం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం కలకలం రేపుతోంది. ఈ యాప్ లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు కేసులు ఎదుర్కొంటున్నారు.   తాజా పరిణామాల…

AP

నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు సమావేశం జరగనుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ల సమావేశంలో సీసీఎల్ఏ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.   తొలి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…

AP

ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ ఎంపీ..

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించిపోయిందని, దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరపాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు.   లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతేనని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.99 వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని, అందులో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం…

AP

ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏప్రిల్ 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలను మార్చి 27వ తేదీలోగా పంపాలని వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదేశాలు జారీ చేశారు.   ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే…

AP

డీలిమిటేషన్ కు మేం వ్యతిరేకం… దక్షిణాది రాష్ట్రాలకు విలువలేకుండా పోతుంది: కేటీఆర్..

డీలిమిటేషన్ పై కాసేపట్లో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభంకానుంది. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్ లో ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్… బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. వీరంతా…

AP

ప్రధాని మోదీకి జగన్ లేఖ..

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కారణంగా పార్టమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుందని… అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరుతున్నామని…

AP

ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య కీలక ఒప్పందం..

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. 40 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్, సంక్షేమం కోసమై గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించారు.   చంద్రబాబు ఉంటే టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఉంటారా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ సాంకేతిక వినియోగంపై ఆలోచనలు పంచుకున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో టెక్నాలజీ వాడకంపై గేట్స్, బాబుల మధ్య చర్చ జరిగింది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 పై బిల్ గేట్స్‌కు తన…