AP

AP

ఏపీకి ప్రభుత్వానికి కొత్త సలహాదారులు..

ఏపీలో కూటమి సర్కార్ ప్రభుత్వానికి కొత్తగా సలహాదారులను నియమించింది. వైసీపీ మాదిరిగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఎంపిక జాగ్రత్త వహించారు. ఎంపికైనవారు ఉన్నత రంగాలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులు. ప్రభుత్వం సైతం ఆయా రంగాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో వారి ఎంపిక ప్రభుత్వానికి తేలికైందని ప్రభుత్వ వర్గాల మాట.   కూటమి సర్కార్ కీలకమైన సలహాదారులు   వైసీపీ ప్రభుత్వంలో సలహాదారులకు కొదవలేదు. ప్రతీ శాఖకు, అలాగే ప్రభుత్వానికి దాదాపు 90…

APNationalTELANGANA

ప్రాజెక్టులపై తెలంగాణ పిటిషన్.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు..

కృష్ణా నదీ ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్లు దాఖలైన వారం రోజుల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని కూడా ఆదేశించింది.   కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం…

AP

మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు..

కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీఐడీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయసాయిని సీఐడీ అధికారులు ఓసారి ప్రశ్నించారు. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు పంపించారు. మార్చి 25న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.   గత బుధవారం నాడు విజయసాయిరెడ్డిని బెజవాడ సీఐడీ కార్యాలయంలో దాదాపు 5 గంటల పాటు…

AP

లంచం కోసం మహిళ మంగళసూత్రం తాకట్టు..!

లంచం కోసం మహిళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టించిన చిత్తూరు జిల్లా ఎస్సైపై ప్రభుత్వం వేటేసింది. అయితే, ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు, 2023లో గత ప్రభుత్వ హయాంలో జరిగింది. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. 2023 సెప్టెంబర్‌లో తన భార్య అదృశ్యమైనట్టు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ తమ మధ్య కుటుంబ పరమైన వివాదాలు…

AP

ఏపీకి గుడ్ న్యూస్..! ఆ మూడు నగరాల్లో లులు మాల్స్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఆధ్యాత్మిక నగరం తిరుపతి, సాగర నగరం విశాఖపట్నంలలో మాల్స్ ఏర్పాటు చేసేందుకు లులు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. నిజానికి 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నం సాగర తీరంలో లులు మాల్‌కు స్థలం కేటాయించింది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అది కాస్త హైదరాబాద్‌కు తరలిపోయింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి వచ్చేందుకు…

AP

వైఎస్ఆర్ పేరు విషయంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

వైఎస్ఆర్ పేరు విషయంలో ఏపీ కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక చోట పూర్తిగా వైఎస్ఆర్ అనే పేరుని తొలగించగా, మరో చోట వైఎస్ఆర్ పేరుకున్న ప్రాధాన్యత కాస్త తగ్గించేలా కేబినెట్ నిర్ణయం ఉంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్ఆర్ పేరుని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇకపై తాడిగడప మున్సిపాల్టీ అనే పేరు మాత్రమే ఉంటుంది. అందులో వైఎస్ఆర్ అనే అక్షరాలు కనిపించవు. ఇక రెండో విషయం కూడా వైఎస్ఆర్ అనే పేరుతో…

AP

వైసీపీ ముఖ్య నేతలకు సాయిరెడ్డి ఉచ్చు..?

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించి.. వారికి ఉచ్చు బిగించారు. కూటమికి ఈ పరిణామాలు వరంగా మారుతున్నాయి. దీంతో, జగన్ అలర్ట్ అయ్యారు. ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. రానున్న రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.…

AP

జనసేనను మతసేనగా మార్చారు.. పవన్ కల్యాణ్‌పై షర్మిల తీవ్ర విమర్శలు..

జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు.   పవన్, చెగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారని.. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. జనసేన పార్టీని ఆంధ్ర మత సేన పార్టీగా మార్చారని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…

AP

తండ్రి చావుతో జగన్ సీఎం.. పిఠాపురం వేదికగా బాలినేని నిప్పులు..!

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నేత అని అన్నారు. జగన్ మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సభావేదికగా తన ఆవేదనను, ఆక్రోశాన్ని, రాజకీయ భవిష్యత్తును స్పష్టం చేస్తూ ఉద్వేగభరితంగా…

AP

అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్నారు.. 21 మంది ఎమ్మెల్యేలతో అడుగుపెట్టాం – వైసీపీకి పవన్ చురకలు.

పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం ప్రారంభంతోనే వైసీపీకి ఇచ్చి పడేశారు. ‘‘తొడలు కొట్టారు. మన ఆడపడుచులను అవమానించారు. జనాలను నిరంతరం హింసించారు. ఇదేం న్యాయం అని అడిగితే.. కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసులో బంధించారు. వాళ్ల కార్యకర్తలను రోడ్డు మీదకు రావాలంటే భయపడేలా చేశారు. వారు…