AP

AP

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ.. పార్టీ విస్తరణ..

ఏపీ అధికారంలో భాగస్వామ్యం తర్వాత జనసేన తొలి ఆవిర్భావ సభ జరగనుంది. కేవలం రెండు కీలక అంశాలు ఎజెండాగా సాగనుంది ఈ సభ. జయ కేతనం పేరుతో జరగుతున్న ఈ ప్లీనరీలో సనాతన ధర్మ పరిరక్షణ, పార్టీ విస్తరణ ప్రధానంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం వీటిపై ఉండనుంది.   ముస్తాబైన పిఠాపురం   జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు పిఠాపురంలోని చిత్రాడ ముస్తాబైంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత…

AP

ఏపీలో ఇంటర్ విద్యలో కీలక మార్పులు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు ఇకపై ఎంపీసీ, బైపీసీ వంటి గ్రూపులతో పాటు ఎం బైపీసీ చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఇంటర్మీడియట్‌ విద్యా మండలితో మంత్రి లోకేశ్‌ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. 2025-26 సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యలో తీసుకురానున్న సంస్కరణలకు ఆమోదం తెలిపింది. విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకుంది.   ఇంటర్‌ విద్యలో కీలక సంస్కరణలో ఏపీ ఇంటర్ బోర్డు గ్రీన్ సిగ్నల్…

AP

జడ్జి ఎదుట భోరున విలపించినా దక్కని ఊరట… పోసానికి 14 రోజుల రిమాండ్..

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.   పోసానిపై ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారని అందరూ భావిస్తున్న తరుణంలో… గుంటూరు సీఐడీ పోలీసులు…

AP

తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలు… హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీకి సూచించింది.   ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తిరుమలలో అక్రమ నిర్మాణాలు ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత అక్కడి అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ధర్మాసనం ఆందోళన…

AP

కదిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కల్యాణోత్సవం కార్యక్రమములో ముఖ్య అతిథిగ పాల్గొనడానికి విచ్చేసిన మంత్రివర్యులు గౌ//శ్రీ నారా లోకేష్ గారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేకిరి గంగాధర్ గారు మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు..

కదిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కల్యాణోత్సవం కార్యక్రమములో ముఖ్య అతిథిగ పాల్గొనడానికి ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కు విచ్చేసిన గౌరవనీయులు మానవవనరుల, ఐటి ,ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి,విద్యాశాఖల మంత్రివర్యులు గౌ//శ్రీ నారా లోకేష్ గారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేకిరి గంగాధర్ గారు మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు

AP

ఈనెల 12న శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత పోరును జయప్రదం చేయండి..

యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించి జిల్లా YSRCP శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి,శ్రీ సత్యసాయి జిల్లా YSCP అధ్యక్షులు ఉషాశ్రీచరణ్ గారు   విద్యార్థులు,నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ కూటమి ప్రభుత్వ వైకరిని నిరసిస్తూ..విధ్యార్ధులకు,నిరుద్యోగులకు అండా నిలుస్తూ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనెల 12న మన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిర్వహించబోయే వైయస్సార్ కాంగ్రెస్…

AP

అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు..

అనంతపురం :   అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు*l స్వేచ్ఛగా తమ సమస్యలను విన్నవించుకున్న 61 మంది పిటీషనర్లు చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన జిల్లా ఎస్పీ   నిర్దిష్ట గడువులోపు చట్ట పరిధిలో అర్జీలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”…

AP

ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి..: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, మార్చి 10 : – జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఉపాధి హామీ పథకం, జి.ఎస్.డబ్ల్యు.ఎస్, ఎంఎస్ఎంఈ సర్వే, పి4 సర్వే, తదితర అంశాలపై డ్వామా పిడి, డిఎల్డివోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లు, ఏపీడీలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా…

AP

జైలు నుంచే వైసీపీ నేతలతో బోరుగడ్డ కాన్ఫరెన్స్ కాల్స్..!

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కోసం పోలీసుల వేట మొదలైంది. ప్రస్తుతం ఆయన తెలంగాణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడున్నాడనే దానిపై ఫోకస్ చేశారు పోలీసులు. తాజాగా తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచనల వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అనిల్ మాటల్లో ఏమైనా నిజముందా? లేక కొత్త డ్రామా మొదలుపెట్టాడా? అన్నది అసలు పాయింట్.   బోరుగడ్డ అనిల్ ఎక్కడ?   రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ గురించి చెప్పనక్కర్లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు.…

AP

బెయిలుపై బయటకు వచ్చి.. అజ్ఞాతంలోకి వెళ్లిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్..

తల్లి అనారోగ్యంతో బాధపడుతోందంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో మధ్యంతర బెయిలు పొందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్‌, వేళాంగిణి నగర్‌లో ఆయన ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు దర్శనమిచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడం, ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండటంతో వారి ఆచూకీ కోసం పోలీసు గాలిస్తున్నారు.   తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వారి…