అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే… గాలిస్తున్న పోలీసులు..
వైసీపీ రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి నమోదైన కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నిమిత్తం సత్యసాయి జిల్లా రాప్తాడులోని ప్రకాష్ రెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఆయన ఇంట్లో అందుబాటులో…

