AP

AP

మిర్చి ధర పతనంపై కేంద్రంతో మాట్లాడా… ఆందోళన వద్దు: ఢిల్లీలో చంద్రబాబు..

మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధరలు తగ్గడంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ధరలు భారీగా పడిపోయాయన్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో రైతులకు మంచి ధర వచ్చిందన్నారు.   ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయాయని, మిర్చి రైతుల సమస్యలను కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన అన్నారు. కేంద్రమంత్రి పర్యటనలో ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…

AP

నంద్యాల్ టు విజయవాడ ఆర్టీసీ బస్సులో 13 తులాల బంగారం అపహరణ..

ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి ఫ్యామిలీ తిరుణాల నిమిత్తం అహోబిలం వెళ్లి తిరిగి వస్తుండగా గాజులపల్లి సమీపంలో విజయవాడ బస్సులో గిద్దలూరు వరకు ప్రయాణం చేస్తుండగా 13 తులాల బంగారం అపహరణ అయిందని బాధితులు తెలిపారు..   పూర్తి వివరాలు పోలీసు ల విచారణలో తెలియాల్సింది…….

AP

ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు..

అమరావతి : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డిఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా లోకేష్ చర్చించారు.  

AP

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం.. త్వరలో రైతు సాధికార సంస్ధతో కీలక ఒప్పందం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించి ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఛైర్మన్ క్రేయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెగ్‌కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా ముఖ్యమంత్రితో…

AP

వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాకిచ్చిన‌ హైకోర్టు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను న్యాయ‌స్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ముంద‌స్తు బెయిల్ కావాల‌ని వంశీ పిటిష‌న్ వేశారు. ఆయ‌న పిటిష‌న్ ను విచారించిన హైకోర్టు దానిని కొట్టివేసింది. కాగా, ద‌ళిత యువ‌కుడు స‌త్య‌వ‌ర్ధ‌న్‌ కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న విజ‌య‌వాడ…

AP

జగన్‌కు కష్టాలు తప్పవా..?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మళ్లీ ఇబ్బందులు తప్పవా? ప్రజల్లో సానుభూతి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఏదో విధంగా జైలుకి వెళ్లాలని నిర్ణయించుకున్నారా? కావాలనే పోలీసులను ఆయన బెదిరించారా? బెయిల్‌పై వున్న జగన్ ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? ఎందుకు జగన్ సహనం కోల్పోయారు? దీనిపై కూటమి సర్కార్ ఆలోచన ఎలా ఉంది? కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   నోరు జారుతున్న జగన్   వైసీపీ అధినేత…

AP

జనసేన ఆవిర్భావ వేడుకలపై కీలక నిర్ణయం..

జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను జనసేనాని పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.   సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలకపాత్రను పోషించింది. ఘన విజయం తర్వాత మొదటి ఆవిర్భావ సభ కావడంతో… సభకు భారీ ఏర్పాట్లు…

AP

అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టండి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే… కేవలం 1,001 స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. మిగిలిన స్టేషన్లలో కెమెరాలు ఎందుకు పెట్టలేదని నిలదీసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని పీఎస్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని…

AP

త్వరలో ఏపీకి 5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు..

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకు వచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో మంత్రి సవిత రెండో రోజు సోమవారం కూడా పాల్గొన్నారు.   ఈ…

AP

ఏపీలో రోజు రోజుకి పెరుగుతున్న GBS కేసులు..

ఓవైపు బర్డ్‌ఫ్ల్యూ వైరస్..!! మరోవైపు GBS వ్యాధి..! తెలుగు రాష్ట్రాల్లో కొత్త రోగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రను వణికించిన GBS.. ఇప్పుడు ఏపీలోనూ బయటపడింది. గుంటూరులో ఏడుగురికి ఈ వ్యాధి సోకింది. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందులో ఇద్దరు కోలుకొని డిశ్చార్జ్ కాగా, మరో ఐదుగురికి చికిత్స కొనసాగుతోంది. కాగా గురువారం నాడు శ్రీకాకుళంలో ఓ వ్యక్తికి సోకింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కూడా ఈ వ్యాధి లక్షణాలు…