CINEMA

CINEMA

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..! ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా నుంచి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 21వ తేదీన ఉదయం 10:08 గంటలకు ‘ఓజీ’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.   ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానుల సందడి…

CINEMA

ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’ సినిమా..! ఎప్పుడంటే..?

‘మహావతార్ నరసింహ’ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో ‘నెట్ ఫ్లిక్స్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటలకు సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన వెలువడింది.   శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. విడుదలైన…

CINEMA

‘బిగ్ బాస్ సీజన్ 9’ అఫీషియ‌ల్‌ లాంచింగ్ డేట్ వ‌చ్చేసింది..

తెలుగు టెలివిజన్ చరిత్రలో సరికొత్త ప్రయోగానికి బిగ్ బాస్ సిద్ధమైంది. ఈసారి ఒకే ఇంట్లో కాకుండా, ఏకంగా రెండు ఇళ్లలో ఈ రియాలిటీ షో సందడి చేయనుంది. ‘సెలబ్రిటీలు వర్సెస్ సామాన్యులు’ అనే వినూత్న థీమ్‌తో బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ మేరకు నిర్వాహకులు అధికారికంగా ప్రోమో విడుదల చేయడంతో షోపై అంచనాలు భారీగా పెరిగాయి.   అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ తొమ్మిదో సీజన్, సెప్టెంబర్ 7వ తేదీ…

CINEMA

శ్రీదేవి, రాఘవేంద్రరావు వల్లే ఆ సినిమా హిట్టయింది: నాగార్జున..

తన సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన ‘ఆఖరి పోరాటం’ సినిమాపై అగ్ర నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ భారీ విజయం సాధించిన చిత్రంలో తానొక బొమ్మలా మాత్రమే ఉన్నానని, అసలు విజయం దర్శకుడు రాఘవేంద్రరావు, నటి శ్రీదేవిలకే దక్కుతుందని చెప్పారు. నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో పాల్గొన్న నాగార్జున, తన కెరీర్ ఆరంభంలోని అనేక సంగతులను గుర్తుచేసుకున్నారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కమర్షియల్…

APCINEMA

గేమ్ చేంజర్, వీరమల్లు సినిమాలపై రోజా కీలక వ్యాఖ్యలు..!

టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన నటించిన వార్-2 సినిమా ఎలా ఆడుతుందో చూస్తామని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించినట్టుగా వార్తలు రావడం… దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమనడం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై వైసీపీ మహిళా నేత రోజా స్పందించారు.   “ఇవేమైనా ఈవీఎంలు అనుకున్నారా… మార్చివేసి మోసం చేయడానికి! సినిమాలు…

CINEMA

వేతన పెంపుపై చర్చలు ఫలించకపోతే షూటింగ్ లు బంద్: కార్మిక సంఘాలు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వేతనాల పెంపు వివాదంపై చర్చలు కొనసాగుతున్నాయి. నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలపై ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో తాజాగా ఈ రోజు మరోసారి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. వేతన పెంపు విషయంలో నిర్మాతలు చేసిన మూడేళ్ల ప్రతిపాదనకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. వేతనాలను 30 శాతం పెంచాలన్న డిమాండ్ పై ఈ రోజు జరగనున్న చర్చలు ఫలవంతం కావాలని…

CINEMA

బిగ్ బాస్ సీజన్-9 ప్రోమో రిలీజ్..!

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ మళ్లీ వచ్చేస్తోంది. వరుసగా ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 9వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ సీజన్‌కు ‘డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. ఈసారి షో ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.   తాజాగా విడుదల చేసిన ప్రోమోలో…

CINEMA

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి ‘కోట’గా చిరపరిచితులైన ఆయన ఈ తెల్లవారుజామున ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కొడుకు కోట ప్రసాద్ 21 జూన్…

CINEMA

ఆన్ లైన్ మోసానికి గురైన యాంకర్ అనసూయ..!

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులను పంపించకుండా తనను మోసం చేశారంటూ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ముందే చెల్లించినా తాను ఆర్డర్ చేసిన దుస్తులను ఇప్పటి వరకూ పంపలేదని మండిపడ్డారు. ఈమేరకు యాంకర్ తాజాగా ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.   అనసూయ ఇన్ స్టా పోస్ట్ ప్రకారం.. దాదాపు నెల రోజుల క్రితం ట్రపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్ సైట్…

CINEMA

మహానాడుకు రమ్మంటూ అన్నగారి పిలుపు..

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమానికి తరలిరావాలంటూ అన్న ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికతతో టీడీపీ ఈ వీడియోను సృష్టించి ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఈ పోస్టులో ఏఐ ద్వారా నందమూరి తారకరామారావు మాట్లాడినట్లు వీడియో సృష్టించారు.   ‘ప్రియమైన నా…