రాజమౌళికి తాంత్రిక విద్యలు కూడా తెలుసు… పోటీగా ఉన్న డైరెక్టర్లను తొక్కేశాడు: శ్రీనివాసరావు..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన టార్టర్ భరించలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వీడియో, లేఖను విడుదల చేశారు. ‘యమదొంగ’ సినిమాకు శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ఒక అమ్మాయితో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలిపారు. ఆమెను ముందు రాజమౌళి ప్రేమించాడని, ఆ తర్వాత తాను ప్రేమించానని చెప్పారు.…

