అల్లు అర్జున్ ‘లిటిల్ ప్రిన్సెస్’ అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కుమార్తె అల్లు అర్హ 9వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సోషల్ మీడియాలో తన ప్రేమను కురిపిస్తూ ఓ ప్రత్యేక పోస్ట్ చేశారు. అల్లు అర్జున్, అర్హ ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతున్న క్యూట్ ఫోటోను ఆయన తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. “నా లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ హృద్యమైన క్యాప్షన్ జోడించారు. ఈ తండ్రీకూతుళ్ల మనోహరమైన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా…

