పైరసీ ఆగిపోతే సినిమా వసూళ్లు పెరుగుతాయా? సోషల్ మీడియాలో చర్చ
ఇటీవల ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ (iBOMMA) మూసివేత, దాని నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్టు వ్యవహారాలపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నేళ్లుగా పైరసీ కారణంగా ఇండస్ట్రీ భారీ ఆర్థిక నష్టాలను చవిచూసిందని, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పరిణామం నేపథ్యంలో పైరసీ ఆగిపోతే సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు నిజంగా పెరుగుతాయా? అనే అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు సినీ పరిశ్రమ ప్రతినిధులు,…

