ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ లెజెండ్ అనిల్ కపూర్: భారీగా పెరుగుతున్న అంచనాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ఈ పాన్-ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ఖరారైంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘డ్రాగన్’ పోస్టర్‌ను పంచుకుంటూ ధ్రువీకరించారు. ‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్‌తో అనిల్ కపూర్ కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది కావడం విశేషం. ఆయన రాకతో…

