నాన్న జ్ఞాపకార్థం.. పదేళ్ల తర్వాత మళ్లీ సంక్రాంతి వేడుకలు: ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశి ఆవేదన
తెలుగు వెండితెరపై తనదైన హాస్యంతో కోట్లాది మందిని నవ్వించిన ఎమ్మెస్ నారాయణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కుమార్తె శశికిరణ్ నారాయణ, తన తండ్రి మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి ఎమోషనల్ అయ్యారు. సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టపడే నాన్న, సరిగ్గా అదే పండుగ సమయంలో భీమవరంలో అనారోగ్యానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లడం…

